Delhi: ఢిల్లీని మూసేసిన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో అధికారులు ఈరోజు 12 విమానాలను రద్దు చేశారు. మరో 100 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 123 విమానాలు సగటున అరగంట పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో అధికారులు ఈరోజు 12 విమానాలను రద్దు చేశారు. మరో 100 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 123 విమానాలు సగటున అరగంట పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.
బాలయ్య 'డాకు మహారాజ్' జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ''ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో.. నేను చంపడంలో చేశా'' అనే డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.
మైనర్ బాలిక పై లైంగిక దాడి కేసులో కమెడియన్ ఫన్ బకెట్ భార్గవ్ కి 20 ఏళ్ళ జైలు శిక్ష పడింది. ఈ కేసు పై నేడు విచారణ జరిపిన విశాఖ జిల్లా పోక్సో కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్షతో పాటు రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
L&T చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ 90 గంటల పాటు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై నటి దీపికా పదుకొణె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యకరం. #మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అంటూ పోస్ట్ పెట్టింది.
జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఖాళీ అయిన కెనడా ప్రధానమంత్రి పదవికి భారీ పోటీ ఏర్పడింది. ఈ రేసులో తాను కూడా ఉన్నానని నేపియన్ ప్రాంత ఎంపీ చంద్ర ఆర్య ప్రకటించారు.
హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.చెరువు కబ్జా చేసి.. అక్రమంగా నిర్మాణాల చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది.
ఇక పై ఏ టికెట్ కావాలన్నా మీ టికెట్ యాప్ ఉంటే చాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లు..పార్కులు, ఇతర పర్యాటక స్థలాల్లో ప్రవేశాలకు ఎంట్రీ టికెట్లను ఈ యాప్ తో పొందచ్చన్నారు.