Fun Bucket Bhargav: బిగ్ షాక్..! ఫన్‌బకెట్‌ భార్గవకు 20 ఏళ్ల జైలు

మైనర్ బాలిక పై లైంగిక దాడి కేసులో కమెడియన్ ఫన్ బకెట్ భార్గవ్ కి 20 ఏళ్ళ జైలు శిక్ష ప‌డింది. ఈ కేసు పై నేడు విచారణ జరిపిన విశాఖ జిల్లా పోక్సో కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్షతో పాటు రూ.4 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

New Update

Fun Bucket Bhargav: యూట్యూబ్ టిక్ టాక్ వీడియోస్ తో ఫన్ బకెట్ భార్గవ్ బాగా ఫేమస్ అయ్యాడు. అయితే కొన్ని రోజుల క్రితం  మైనర్ బాలికపై  లైంగిక దాడికి పాల్పడినట్లు భార్గవ్ పై  కేసు నమోదైంది. తనతో పాటు యూట్యూబ్ వీడియోలు చేసే ఓ బాలికపై లైంగిక దాడి చేయడంతో..  ఆమె  గ‌ర్భం దాల్చిందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు భార్గవ్ పై 'దిశా'  చట్టంతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు చేసి అరెస్టు చేశారు. 

Also Read: Game Changer: బాబూ శంకరూ... ఇంకా అదే పాత చింతకాయి పచ్చడి అయితే ఎలా? రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ఆవేదన

20 ఏళ్ళు జైలు శిక్ష.. 

అయితే ఈ కేసు పై నేడు విచారణ జరిపిన  విశాఖ జిల్లా పోక్సో కోర్టు కీలక తీరునిచ్చింది. భార్గవ్ కి 20 ఏళ్ళ క‌ఠిన కారాగార శిక్షతో పాటు రూ.  4 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాలంటూ కోర్టు  తీర్పును వెల్ల‌డించింది. 

Also Read: Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్‌.. అమెరికాలో ఏం జరుగుతోంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు