Deepika Padukone: ఇటీవలే ఎల్ అండ్ టీ(L&T) ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్.. వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారం సెలవునూ వదిలేయాలని చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నభిపాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనె సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యకరం. #మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. Also Read: Cricketer Divorce: విడాకులకు సిద్ధమైన మరో టీమిండియా క్రికెటర్ ''మరింత దిగజారారు'' మరో వైపు చైర్మన్ వ్యాఖ్యలపై ఎల్ అండ్ టీ సంస్థ వివరణ ఇచ్చింది. ఎనిమిది దశాబ్దాలుగా జాతి నిర్మాణమే ఎల్ అండ్ టీ సంస్థ ప్రధాన లక్ష్యంగా ఉంది. భారత మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను ఎల్ అండ్ టీ సంస్థ ఎంతో మెరుగుపరిచింది. అభివృద్ధి చెందే దేశంగా ఎదిగే క్రమంలో.. అసాధారణ లక్ష్యాలను చేరాలంటే అసాధారణ కృషి అవసరం. ఈ విస్తృత లక్ష్యాన్నే ఛైర్మెన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయని కంపెనీ ప్రతినిధి వివరణ ఇచ్చారు. అయితే దీనిపై కూడా దీపికా స్పందించింది. '' క్లారిటీ ఇచ్చి మరింత దిగజారారు'' అంటూ మరో పోస్ట్ పెట్టింది. Also Read: USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా Also Read: నిమిషానికి 4 లక్షల బులెట్లతో చైనా కొత్త గన్.. డేంజర్లో అగ్రరాజ్యం! ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ ఏం అన్నారంటే .. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. వారానికి 90 గంటలు పని చేయాలి . అవసరమైతే ఆదివారాలు కూడా వదిలేసుకోవాలి.ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. ఆదివారాలు మీతో పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీతో అలా పని చేయించగలిగితే.. నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పని చేస్తున్నాను అంటూ ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా..నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. భార్య ప్రస్తావన తీసుకువస్తూ ఆయన మాట్లాడిన మాటలను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. Also Read: Game Changer: బాబూ శంకరూ... ఇంకా అదే పాత చింతకాయి పచ్చడి అయితే ఎలా? రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఆవేదన