జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఖాళీ అయిన కెనడా ప్రధానమంత్రి పదవికి భారీ పోటీ ఏర్పడింది. ఈ రేసులో తాను కూడా ఉన్నానని నేపియన్ ప్రాంత ఎంపీ చంద్ర ఆర్య ప్రకటించారు. తప్పకుండా తాను ప్రధాని పదవికి పోటీ పడతానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన సందేశంతో ఆయన ఒక వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.. కెనడా పునర్నిర్మాణానికి దోహదం చేసేలా ప్రభుత్వాన్ని సమర్ధంగా నడపగలనని ఎంపీ చంద్ర ఆర్య విశ్వాసం వ్యక్తం చేశారు. Also Read: తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా కెనడా భావితరాల వికాసం కోసం సురక్షితమైన మార్గాన్ని తాను నిర్మించగలనని ఆయన తెలిపారు.""నేను మొదటి నుంచీ కెనడా ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాను. మన పిల్లలు, మనవళ్లు/మనవరాళ్ల కోసం కొన్ని సాహసోపేత నిర్ణయాలను తీసుకోక తప్పదు"" అని ఎంపీ చంద్ర ఆర్య తెలిపారు. ""ఒకవేళ నన్ను అధికార లిబరల్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకుంటే, నా అనుభవాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించి కెనడా ఉన్నతికి బాటలు వేస్తానని చెప్పారు. Also Read:Hydra: మణికొండలో హైడ్రా కూల్చివేతలు ఆర్థిక సవాళ్లను... మునుపెన్నడూ లేని కొన్ని నిర్మాణాత్మక సమస్యలను కెనడా ఎదుర్కొంటోంది. వాటిని పరిష్కరించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కెనడా ఆర్థిక వికాసంలో చాలా మంది కెనడియన్లు భాగం కావడం లేదు. ప్రత్యేకించి యువత ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు"" అని చంద్ర ఆర్య వివరించారు. ప్రధానిగా ఎన్నికైతే కెనడా ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలు ఎక్కించగలనని ఆయన ధీమాగా ఉన్నారు. ""కెనడాలో మధ్యతరగతి ప్రజలు పెనుసవాళ్లను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి ఉద్యోగాలతో జీవితం వెళ్లదీస్తున్న ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి వెళ్లిపోతున్నాయి. కెనడా సమాజం సుస్థిరంగా ముందడుగు వేయాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి. అది నేను చేసి చూపించగలను"" అని ఎంపీ చంద్ర ఆర్య అన్నారు. కెనడా ప్రజల కోసం చాలా మంచి ఆర్థిక అవకాశాలను కల్పిస్తానని చెప్పారు. ""పెద్దపెద్ద నిర్ణయాలను తీసుకోవడంలో భయపడని బలమైన నాయకత్వం ప్రస్తుతం మన కెనడాకి కావాలి. అలాంటి నిర్ణయాలే కెనడా పునర్నిర్మాణానికి బాటలు వేస్తాయి. దేశ ప్రజల్లో ఆశను మళ్లీ సజీవం చేస్తాయి. అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తాయి. భావితరాల భవితను సురక్షితంగా మారుస్తాయి. సాహసోపేత నిర్ణయాలు ఐచ్ఛికం కాదు తప్పనిసరి. కెనడా ప్రధానిగా అవకాశమిస్తే నేను ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటా అన్నారు. ఈక్రమంలో తనకు మద్దతుగా నిలవాలని కెనడా ప్రజలను ఆర్య కోరారు. జస్టిన్ ట్రూడో వైదొలిగిన తర్వాత, కెనడా తదుపరి ప్రధాని ఎవరనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్‌లు పేర్లు కూడా వినిపించాయి. భారత సంతతి ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. Also Read: Maha Kumbamela 2025: మహా కుంభమేళాలో యాపిల్ మాజీ సీఈఓ భార్య Also Read:Modi: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ