Telangana: ములుగులో విషాదం.. పథకాల్లో పేర్లు లేవని రైతు మనస్తాపంతో..
ప్రభుత్వ పథకాల్లో తన పేరు లేదని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగులో చోటుచేసుకుంది. లబ్ధిదారుల జాబితాలో తన పేరుతో పాటు ఇతరుల పేర్లు కూడా లేవు. దీంతో తన చావుతో అయినా అందరికి న్యాయం జరుగుతుందని పురుగుల మందు తాగి ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.