R.Krishnaiah : రిజర్వేషన్లు కల్పించకుంటే సంకుల సమరమే-- ఆర్. కృష్ణయ్య సంచలన సంచలన ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య గాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే నివేదికలో చాలా లోపాలు ఉన్నాయని ఆరోపించారు. అనేక కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని అన్నారు.

New Update
R. Krishnaiah

R. Krishnaiah

R.Krishnaiah :  తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)  ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే(Caste Survey)పై బీసీ(BC) ఉద్యమ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య గాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే నివేదికలో చాలా లోపాలు ఉన్నాయని ఆరోపించారు. అనేక కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని అన్నారు. కావాలనే వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)  డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు బీసీ నేతలతో తనను తిట్టించుకుని దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పించాలని అన్నారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని కీలక ప్రకటన చేశారు. రిజర్వేషన్లు కల్పించకుంటే సంకుల సమరమే అంటూ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: By-Elections : తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు ..కేటీఆర్ సంచలన కామెంట్స్

రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)  డైవర్షన్ పాలిటిక్స్...

 రేవంత్ సర్కార్ బీసీలను అణిచివేసేందుకు కుట్రలు పన్నిందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించి అన్ని రంగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునేలా చేస్తున్నారన్నారు. బీసీ వ్యతిరేకిగా సీఎం రేవంత్ రెడ్డి మారారన్నారు.  కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా కులగణనలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారని.. ఇది బీసీలను రాజకీయంగా అణిచివేసే కుట్ర అని ఆరోపించారు.  ఇప్పటికైనా బీసీ వ్యతిరేక విధానాలకు మార్చుకోకపోతే రాష్ట్రం రణరంగం అవుతుందని హెచ్చరించారు.పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు చట్ట బద్ధత కల్పించకపోతే ప్రభుత్వంపై ఉద్యమిస్తానని కీలక ప్రకటన చేశారు. 

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

 ఇదిలా ఉంటే.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. చట్టబద్ధతతో పని లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ తరపున బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలు కూడా అంతే శాతం టికెట్లు కేటాయిస్తారా అంటూ ప్రశ్నించారు. కాగా ఇప్పుడు ఆర్.కృష్ణయ్య బీసీల రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఇది కూడా చదవండి: Murder: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. తల్లీ, కొడుకుపై కత్తులతో దాడి!

ఇది కూడా చదవండి:  తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు