Bomb Threat:100 స్కూళ్లకి పైగా బాంబు బెదిరింపులు.. రష్యా నుంచి మెయిల్స్
ఢిల్లీలోని దాదాపు 100 పాఠశాలలు, నోయిడాలో రెండు పాఠశాలలకు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. ఆయా స్కూళ్లలో బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించలేదు. రష్యా నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.