Air India: నవంబర్‌ 1-19 మధ్య ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు!

ఎయిర్‌ ఇండియా విమానాల్లో నవంబర్‌ 1 నుంచి 19 మధ్య తేదీల్లో ప్రయాణించొద్దని, ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరికలు చేశాడు.భారత్ లో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే.

New Update
Viral Video : ఆ తేదీన ఎయిరిండియా ఫ్లైట్‌ ఎక్కొద్దు.. ఖలిస్థాన్ ఉగ్రవాది వార్నింగ్‌తో టెన్షన్ టెన్షన్..!!

Bomb Threat To Air India : భారత్ లో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు (Bomb Threats)  రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ ఎయిర్‌ ఇండియాకు (Air India) హెచ్చరికలు చేయడం మరోసారి తీవ్ర కలకలం రేపింది. నవంబర్‌ 1నుంచి 19 మధ్య తేదీల్లో ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని అతడు వార్నింగ్‌ ఇవ్వడం గమనార్హం.

Also Read:  వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. హత్య కేసులో కుమారుడి అరెస్ట్!

ఎయిర్‌ ఇండియాకు...

భారత్‌ లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు అవుతున్న క్రమంలో ఎయిర్‌ ఇండియా విమానాల పై దాడి జరిగే అవకాశం ఉందని పన్నూ అన్నాడు. అందులో ఆ తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కాగా పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది మొదటి సారి కాదు.

Also Read:  బాచుపల్లిలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..!

గత నవంబరులోనూ...

గత నవంబరులోనూ ఇలాంటి వీడియో విడుదల చేయడం జరిగింది. నవంబర్‌ 19న ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని , దాని పేరు కూడా మార్చేస్తామని గతేడాది అతడు ఓ వీడియోలో హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి

ఉగ్రవాదిగా...

సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే వేర్పాటు వాద సంస్థను 2007 లో స్థాపించగా...వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ కూడా ఒకడు. ఈ సంస్థను భారత్‌ 2019 లోనే నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం అతడిని 2020 లో ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read:  యహ్యా సిన్వార్ ఓ కసాయే...అడ్డొస్తే చంపేయడమే!

ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. పన్నూకు అగ్రరాజ్యంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది.

Advertisment
తాజా కథనాలు