ఢిల్లీలో రెండు పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌కె పురం, పశ్చిమ విహార్‌లో సోమవారం ఉదయం స్కూల్ లో బాంబ్స్ పెట్టామంటూ మెయిల్ ద్వారా సందేశాలు పంపారు. పాఠశాల యాజమాన్యం పిల్లలను వారి ఇళ్లకు పంపించింది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 7 గంటలకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆర్‌కె పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని జిడి గోయెంకా స్కూల్‌కు బాంబ్ థ్రెట్ ఇమెయిల్ వచ్చాయి. ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు! #WATCH | Delhi | Visuals from outside of DPS RK Puram - one of the two schools that receive bomb threats, via e-mail, today morning pic.twitter.com/sQMOPh4opI — ANI (@ANI) December 9, 2024 Alos Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్! బాంబు బెదిరింపుతో పాఠశాల నిర్వాహకులు విద్యార్థులను ఇళ్లకు పంపించారు. పాఠశాల అధికారులు తమ పిల్లలను ఇంటికి తీసుకురావాలని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పాఠశాల యాజమాన్యం పాఠశాలను ఖాళీ చేయించి బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్‌తో పాఠశాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అయితే ఆ మెయిల్ ఎవరు చేశారో మాత్రం తెలియటం లేదు. పోలీసులు బాంబు బెదిరింపులు చేసినవారి గురించి విచారిస్తున్నారు. Also Read : మహాకుంభమేళా కోసం 13 వేల రైళ్లు.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన ఇది కూడా చదవండి : నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ