Jharkhand: ఈనెల 30న బీజేపీలోకి చంపయ్ సోరెన్.. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఈ నెల 30న బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత అధికారికంగా కన్ఫామ్ చేశారు. రీసెంట్‌గానే చంపయ్ సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. By Manogna alamuru 27 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Champai Soren: మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మధ్యనే ఆ రాష్ట్ర సీఎం చంపయ్ పోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు ముఖ్యమంత్రిగా చేసిన హేమంత్ పోరెన్ భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన జైలు నుంచి విడుదల అయ్యాక చంపయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈయన బీజేపీలో చేరతారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ ముక్తిమోర్చా నేత చంపయ్ సోరెన్ బీజేపీలోచేరుతున్నట్టు ప్రకటించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, దివాసీ నాయకుడు చంపయ్ ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారని..ఆయన అధికారికంగా ఆగస్టు 30న బీజేపీ కండువా కప్పుకుంటారని బిశ్వశర్మ అందులో రాశారు. Also Read: Afghanistan: ఆఫ్ఘాన్‌లో మహిళలపై మళ్ళీ ఆంక్షలు #chmpai-soren #amith-shah #jharkhand #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి