Jammu kashmir: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మరో రెండు నెలల్లో జమ్మూకశ్మీర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది. మరిన్ని రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.