R Krishnaiah : వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా!

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తాను రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య చెబుతున్నట్లు తెలుస్తోంది.

New Update
R Krishnaiah

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ సైతం ఆమోదించారు. ఏపీ నుంచి ఒక సీటు ఖాళీ అయినట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యుల బలం ఉండగా.. ఇటీవల బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో ఆ పార్టీ బలం 9కి పడిపోయింది. ఇప్పుడు ఆర్.కృష్ణయ్య సైతం రాజీనామా చేయడంతో వైసీపీ సభ్యుల సంఖ్య 8కి చేరింది.

బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తా!

బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికే తాను రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య చెబుతున్నారు. అయితే.. ఆయన బీజేపీ లేదా టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది.  

Also Read :  హైడ్రా బాధితులకు రేవంత్ శుభవార్త.. అధికారులకు కీలక ఆదేశాలు!

Advertisment
తాజా కథనాలు