Google : గూగుల్​వయసెంతో తెలుసా...నేడు గూగుల్‌ అందుబాటులోకి వచ్చిన రోజు

గూగుల్‌ అంటే తెలియనివారుండరు. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకూ అందరికీ గూగుల్‌ సుపరిచితమే. ఈ గూగుల్‌ సెర్చింజన్‌ ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందో తెలుసా?  గూగుల్‌ నేటికి గూగుల్‌ అందుబాటులోకి వచ్చి 27 ఏండ్లు పూర్తయ్యింది.

New Update
Google turns 27 today

Google turns 27 today

Google : గూగుల్‌ అంటే తెలియనివారుండరు. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకూ అందరికీ గూగుల్‌ సుపరిచితమే. ఈ గూగుల్‌ సెర్చింజన్‌ ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందో తెలుసా?  గూగుల్‌ నేటికి గూగుల్‌ అందుబాటులోకి వచ్చి 27 ఏండ్లు పూర్తయ్యింది. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత గూగుల్‌ సెర్చింజన్‌ లేకుండా ఎలాంటి పనులు చేసుకోలేని పరిస్థితి.  ఒకనాడు ఏదన్న విషయం తెలుసుకోవాలంటే న్యూస్‌ పేపర్లు, పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. మనకు సమాచారం కావాలంటే వాటిని ఆశ్రయించాల్సిందే. 

అయితే ఇపుడు ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే  క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. రాజకీయాలు,  సినిమా, స్పోర్ట్స్‌, పాలిటిక్స్‌, వస్తువులు ఇలా ఏ విషయమైన క్షణాల్లో మనకు అందుబాటులో ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన గూగుల్‌కు నేడు బర్త్‌ డే. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో గూగుల్‌ భాగమైపోయింది. ఇప్పుడంతా మనకు గూగుల్‌ లేకుంటే ఏమై పోయేవాళ్లం అనుకునే పరిస్థితిలో ఉన్నామంటే గూగుల్‌ మన జీవితంతో ఎంతగా పెనవేసుకపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సెర్చింజన్‌ అందుబాటులోకి వచ్చి నేటికి 27 ఏండ్లు పూర్తయ్యింది.   ఈ సందర్భంగా గూగుల్‌ తన మొట్టమొదటి లోగోతో ప్రత్యేక డూడుల్‌ను రూపొందించడం గమనార్హం.

గూగుల్‌ తొలిసారి1998 సెప్టెంబర్ 4న ఆవిర్భవించింది.  లారీ పేజ్‌, సెర్గే బ్రిన్‌ లు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో దీన్ని ప్రారంభించారు. గూగుల్‌ ఆరంభించిన మొదటి ఏడేళ్లు సెప్టెంబర్‌ 4నే వార్షికోత్సవం నిర్వహించుకున్నారు. కానీ, ఆ తర్వాత రికార్డుల ఆధారంగా 2005 నుంచి సెప్టెంబర్‌ 27కి తన బర్త్‌డే మార్చింది. క్రమక్రమంగా ప్రపంచమంతా అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ అమెరికన్‌ సంస్థ.. నేడు వరల్డ్‌ టాప్‌ కంపెనీల్లో అగ్రగామిగా నిలిచింది. గూగుల్‌లో రోజూ ప్రపంచ వ్యాప్తంగా వందకు మించిన భాషల్లో మిలియన్ల కొద్దీ శోధనలు జరుగుతున్నాయంటే అతిశయోక్తికాదు.

తాము రూపొందించిన ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజిన్‌కు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ లు మొదట గూగోల్ ‌(Googol) అనే పేరు పెట్టాలనుకున్నారు. గూగోల్‌ అంటే.. 1 పక్కన 100 సున్నాలు ఉండే సంఖ్య అని అర్థం. అపారమైన సమాచారాన్ని అందిస్తుంది అనే అర్థం వచ్చేలా ఆ పదం పెట్టాలనుకున్నారు. అయితే.. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో వీళ్లద్దరి సహచర విద్యార్థి ఒకరు Googolను చదివే క్రమంలో  Googol కు బదులు గూగుల్‌ అని తప్పుగా ఉచ్ఛారించారు. అయితే అతను తప్పుగా చదివినా లారీ పేజ్‌కు ఆ పేరు నచ్చడంతో క్షణాల్లో Google.comగా మార్చి దాన్నే ఫైనల్‌ చేశారు.

గడచిన 27 ఏళ్లలో గూగుల్‌ పలు రంగాల్లో విస్తరించింది. సెర్చ్‌తో పాటు యూట్యూబ్‌, ఆండ్రాయిడ్‌, ప్రకటనలు, క్లౌడ్‌ సేవలు, స్మార్ట్‌ డివైజెస్‌, కృత్రిమ మేధస్సు తదితర రంగాల్లో తన సత్తా నిరూపించుకుంది. ప్రస్తుతం ఈ సంస్థకు భారత్‌కు చెందిన సుందర్‌ పిచాయ్‌ సీఈఓగా  పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో కంపెనీ కొత్త పుంతలు తొక్కుతూ మరింతగా ముందుకు దూసుకెళుతోంది.

ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ  రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు

Advertisment
తాజా కథనాలు