Kalpana : పోలీసుల అదుపులో మావోయిస్ట్ కీలక నేత పోతుల కల్పన..మధ్యాహ్నం లొంగుబాటు?
మావోయిస్ట్‌లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్ట్ దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వర్రావు(కిషన్ జీ) భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతక్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ప్రచారం సాగుతోంది.