/rtv/media/media_files/2025/11/28/fotojet-2025-11-28t070904713-2025-11-28-07-09-40.jpg)
Big shock for Maoists...Devji in police custody..?
Maoist Devji: మావోయిస్టు పార్టీకి మరో మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ కార్యదర్శి దేవ్‌జీతో పాటు మరో 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జడ్‌సీ) ఒక సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు వారిని వారిని కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది. డీకేఎస్‌జడ్‌సీ కార్యదర్శి వికల్ప్ పేరిట వెలువడిన ఈ ప్రకటనలో హిడ్మా ఎన్‌కౌంటర్ గురించి కూడా ప్రస్తావించడం గమనార్హం.
ఈనెల 22వ తేదీతో ఉన్న ఆ ప్రకటన గురువారం సామాజిక మధ్యమాల్లో వెలుగుచూసింది. నవంబరు 18న ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో హిడ్మా సహా ఆరుగురిని పోలీసులు హతమార్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. మరునాడు అంటే నవంబర్19న అదే ప్రాంతంలో సురేశ్, శంకర్‌సహా ఏడుగురిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారని ఆయన ఆరోపించారు.
అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవ్‌జీసహా మరో 50 మందిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు మిగిలిన మావోయిస్టులను కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈనెల 30న ఛత్తీస్‌గఢ్ దండకారణ్య బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఈ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. సెప్టెంబరు 21న కోసాదాదా, రాజుదాదాలనూ బూటకపు ఎన్‌కౌంటర్‌లో ప్రభుత్వం హతమార్చిందని వికల్ప్ ఆరోపించారు. గిరిజన ప్రజల రాజ్యాంగ హక్కులను విస్మరిస్తూ దండకారణ్యం మొత్తం సైనిక కంటోన్మెంట్‌గా రూపాంతరం చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ గనుల కోసం లక్షల చెట్లను నరికి వేస్తున్నారని.. అభయారణ్యాల పేరుతో స్థానిక ప్రజలను నిర్వాసితులను చేయడానికి నోటీసులు జారీ చేస్తున్నారని వికల్ప్ మండిపడ్డారు.
Follow Us