కోలుకోలేని దెబ్బ కొడతాం.. అమెరికా, ఇజ్రాయెల్‌ కు ఇరాన్ వార్నింగ్

అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీఖమేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తోపాటు తమ మిత్రపక్షాలపై దాడులు చేస్తే కోలుకోలేని దెబ్బ కొడతామని హెచ్చరించారు. ఈ రెండు దేశాలు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.

New Update
SE D

Ayatollah Ali Khamene: అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీఖమేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తోపాటు తమ మిత్రపక్షాలపై దాడులు చేస్తే కోలుకోలేని దెబ్బ కొడతామని హెచ్చరించారు. ఇరాన్‌ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులపై అయతొల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇరాన్‌, రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ విషయంలో ఇజ్రాయెల్‌, అమెరికాలు చేస్తున్న పనులకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. 

తగిన ఫలితం అనుభవిస్తారు..

మా శత్రువులు జియోనిస్టులు, అమెరికా అయినా.. వారు చేస్తున్న పనులకు తగిన ఫలితం అనుభవిస్తారు. ఇరాన్ పై దాడులకు పాల్పడిన వారిని కోలుకోలేని దెబ్బ కొడతామన్నారు. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలను ఢీకొట్టేందుకు ఇప్పటికే టెహ్రాన్‌ నిర్ణయించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలైన తర్వాత తమ ప్రణాళికను అమలుచేయాలని చూస్తోంది. యూఎస్ ఎన్నికలు ముగియగానే ప్రతిదాడికి సిద్ధంగా ఉండాలని సైనిక అధికారులను ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీ ఆదేశించినట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్‌ క్షిపణుల దాడి.. జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం!

200 క్షిపణులతో దాడి.. 

ఇక గత నెలలో ఇజ్రాయెల్ పై 200 క్షిపణులతో ఇరాన్‌ విరుచుకుపడింది. దీంతో ఇరాన్‌ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడింది. ఇరాక్‌ భూభాగం నుంచి ఇరాన్‌ తన అనుకూల మిలిటెంట్లతో దాడి చేసే అవకాశం ఉన్నట్లు ఇజ్రాయెల్‌ భావిస్తోంది. దీంతో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. 

ఇది కూడా చదవండి: కేటీఆర్‌ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు