Israel-Hamas War: ఆయుధాలతో ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా ఫ్లైట్ ..!!
హమాస్ విషయంలో అమెరికా వైఖరి స్పష్టంగా ఉంది. అమెరికా ఇజ్రాయెల్‌కు పాత మిత్రదేశం. దోషులను వదిలిపెట్టబోమని అమెరికా పేర్కొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2.3 మిలియన్ల జనాభా ఉన్న గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రతీకారం తీర్చుకుంది, ఇందులో ఇప్పటివరకు 900 మంది మరణించారు. 4,600 మంది గాయపడ్డారు. మృతుల్లో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ కు మిత్రదేశమైన అమెరికా..ఆయుధాలతో కూడిన మొదటి విమానం ఇజ్రాయెల్‌కు పంపించింది. హమాస్ కు చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్ కు అన్నివిధాలా సహాయం అందిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అటు ఇజ్రయెల్ ప్రతికార దాడిలో 900 మంది హమాస్ ఉగ్రవాదులు మరణించారు.