BC Reservation In Local Bodies: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇంకెంత కాలం ? సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని సీఏం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమంటూ సీఎంకు బహిరంగ లేఖ రాశారు.