Local Body Elections : ఆ పదిస్థానాలకు ఎన్నికలు...మరో ఎన్నికలకు సై అంటోన్న రెండు పార్టీలు

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల విషయంలోనూ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం  సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత కేసు తీర్పు రిజర్వ్ అయింది. దీంతో, సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.  

New Update
local body elections

local body elections

Local Body Elections : తెలంగాణ రాజకీయాలు రోజు రోజు వేడెక్కుతున్నాయి. రాష్ర్టంలో అధికారంలోకి వచ్చింది మొదలు రేవంత్‌ రెడ్డి తీసుకనే ప్రతి విషయం వివాదస్పదమవుతోంది. ఒకవైపు మంత్రి వర్గ విస్తరణలో ప్రతిష్టంభన నెలకొన్నది. మరోవైపు కంచ గచ్చిబౌళి భూముల విషయం కూడా వివాదస్పందంగా మారింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేల విషయంలోనూ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం  సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత కేసు తీర్పు రిజర్వ్ అయింది. దీంతో, సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.  వారిపై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రాకుంటే తెలంగాణలో ఎన్నికలు తప్పవనే ఆలోచనకు రేవంత్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు సూచించారట. ఇక మరోవైపు సుప్రీంలో తమకు అనుకూలంగా తీర్పను వస్తుందని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలకు రెడీ అవతున్నది. ఈ క్రమంలో కేసీఆర్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.  

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై అనర్హత వేయాలని గులాబీ పార్టీ నేతలు సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ అయింది. ఇదే అంశం పైన అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు సైతం విచారణ వేళ ప్రస్తావనకు వచ్చాయి. ఇక, బీఆర్ఎస్ మాత్రం ఉప ఎన్నికలు తప్పవని చెబుతోంది. సుప్రీం నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారుతున్న సమయంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికల సమరానానికి సై అంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్ని కలకు వెళ్లే యోచనలో రేవంత్ ఉన్నట్లు కనిపిస్తోంది. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సి పాలిటీలకు కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని పైన కసరత్తు మొదలైంది.

స్థానిక సంస్థల ఎన్నికలను జూలైలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్ని కల ఏర్పాట్లపైనా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీలకు ఎన్నికలకు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీల్లో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించాలనే ఆలో చనలో ప్రభుత్వం ఉంది. అధికారులు మాత్రం ముందు సర్పంచ్‌ ఎన్నికలే నిర్వహించాలని సూచిస్తున్నారని సమాచారం. గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఇప్పటికే ఏడాదికి పైగా అయ్యిందని, కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిఽధులు కూడా రూ.1,500 కోట్లకు పైగా నిలిచిపోయాయనే వివరాలను సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. మొదట సర్పంచ్‌ ఎన్నికలను నిర్వహించి, ఆయా పాలకవర్గాల వివరాలను కేంద్రానికి నివేదిస్తే.. నిలిచిపోయిన నిధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

ప్రస్తుతం పంచాయతీలు, మునిసిపాలిటీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం చొప్పున రిజర్వేషన్లను అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీల రిజర్వేషన్లను 29 నుంచి 42 శాతా నికి పెంచుతూ అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదించింది. అవి గవర్నర్‌ ఆమోదం కోసం పంపారు. పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బీసీ బిల్లులు చర్చకు రాలేదు. మళ్లీ వానాకాలంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. దీంతో ఈ అంశంపై మరికొంత కాలం వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికలకు వెళ్లాలనుకుంటే గతంలో అమలైన రిజర్వేషన్లతోనే నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో, రిజర్వేషన్ల విషయంలో న్యాయ సలహాలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఈ అంశం పైన స్పష్టత వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల పైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు