Local body elections : లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్ గా ..

పదేళ్లు తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ ఒక్కస్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది.

New Update
 Telangana Bhavan

Telangana Bhavan

Local body elections :పదేళ్లు తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. గెలిచిన ఎమ్మెల్యేల్లోనూ పదిమంది అధికార పార్టీలో చేరారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ ఒక్కస్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. అధికార పార్టీని అడుగడుగున టార్గెట్‌ చేస్తూ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తోంది. కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలషెడ్యూల్‌ వెలువడినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తోంది. దానికోసం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  రోజుకో జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్‌కు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల ద్వారానే పార్టీని బలోపేతం చేసేందుకు ప్లాన్‌ వేస్తోంది. దీనికోసం స్థానిక సంస్థల్లో సత్తాచాటాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది. గ్రామాలను ప్రభావితం చేసే స్థానిక సంస్థల ఎన్నికలపై కారు పార్టీ దృష్టి సారించింది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నాటి టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. నాడు పలు జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుని బలమైన పార్టీగా ఎదిగింది. ఇప్పుడు కూడా అదే దారిలో నడవాలని చూస్తోంది.

ఇది కూడా చదవండి: Delhi CM: ఢిల్లీ సీఎం ఎవరు ?.. రేసులో ఉంది వీళ్లే

మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కుల గణన విషయంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. 42 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రస్తుతం దాని నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తుంది. అందులో భాగంగా ఆదివారం మాజీమంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం జరగనుంది. ఆదివారం ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం క్షేత్రస్థాయి కార్యాచరణకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. బీసీ కులగణన ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున కార్యచరణ ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళనకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది.

ఇది కూడా చదవండి: Delhi Results: 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలుపు.. ప్రధాన కారణాలు ఇవే !

ఒకవైపు అందరికీ రుణమాఫీ కాకపోవడం, రేషన్‌కార్డుల పంపిణీ జరగకపోవడం, రైతు భరోసా అందరికీ అందకపోవడం, బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేకపోవడం వంటి అంశాలను గ్రామీణ ప్రజల దృష్టికి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. రేవంత్‌ రెడ్డి అవలంభిస్తు్న్న విషయాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.

Also Read :  ఓటీటీలో సుదీప్ కిచ్చా మ్యాక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు