Revanth Reddy letter: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ!

సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్, BRS, MJP, MIM, CPI నాయకులతో మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు  42శాతానికి పెంచే బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.

New Update
revanth reddy

revanth reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. లేఖలో కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు  42శాతానికి పెంచాలని సోమవారం రెండు బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నేపథ్యంలో బిల్లులకు కేంద్రం మద్ధతు కోరేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు.

Also read: Professor Harassment: ప్రొఫెసర్ కాదు కామాంధుడు... వీడియోలు తీసి కోరికలు తీర్చాలంటూ టార్చర్!

అలాగే మార్చి 27న ఢిల్లీలో తెలంగాణ డీసీసీ, సిసిసి అధ్యక్షుల సమావేశం కానున్నారు. తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కాంగ్రెస్ నాయకులు మీటింగ్‌కు హాజరుకానున్నారు. ఢిల్లీలోని నూతన భవనం ఇందిరా భవన్ లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన సమావేశమవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు.

Also Read : కుంభమేళాలో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు? హైకోర్టు సంచలన తీర్పు!

తెలంగాణ అసెంబ్లీ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లును సోమవారం సభ ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశ పెట్టగా ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశ పెట్టారు. ఈ బిల్లును కేంద్రానికి పంపించనుండగా ఆమోదం కోసం పార్టీలన్నీ ఐక్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం కోరింది. దీనికి సంపూర్ణ మద్ధతు ఇస్తామని బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేసింది. 

Advertisment
తాజా కథనాలు