Tarique Rahman's swearing : బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం:మోదీ బదులు ఓం బిర్లా

తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ నెల 17న (ఫిబ్రవరి 17, 2026) ఢాకాలో జరగనున్న ఈ వేడుకలో ఆయన పాల్గొంటారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.

New Update
bangladesh

బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ నెల 17న (ఫిబ్రవరి 17, 2026) ఢాకాలో జరగనున్న ఈ వేడుకలో ఆయన పాల్గొంటారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) భారీ విజయాన్ని నమోదు చేయడంతో, ఆ పార్టీ ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ ఇప్పుడు పగ్గాలు చేపట్టబోతున్నారు.

మోదీని ఆహ్వానించినప్పటికీ

ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినప్పటికీ, అదే రోజు ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలు ఉండటంతో ఆయన వెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రతినిధిగా ఓం బిర్లాను పంపాలని కేంద్రం నిర్ణయించింది. పొరుగు దేశంతో భారత్ కొనసాగిస్తున్న స్నేహపూర్వక సంబంధాలకు, ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న గౌరవానికి ఓం బిర్లా పర్యటన నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంది.

ఈ వేడుకలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. వీరితో పాటు చైనా, సౌదీ అరేబియా, టర్కీ వంటి మరో 13 దేశాల ప్రతినిధులను కూడా ఢాకా తాత్కాలిక యంత్రాంగం ఆహ్వానించింది. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి ఎన్నికల్లో గెలిచిన తారిఖ్ రెహ్మాన్‌కు ప్రధాని మోదీ ఇప్పటికే ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇరు దేశాల అభివృద్ధి, శాంతి కోసం కలిసి పని చేస్తామని ఈ సందర్భంగా మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు