/rtv/media/media_files/2025/07/24/hypersonic-missile-tayfun-block-4-2025-07-24-12-51-19.jpg)
Roketsan presents turkey’s first hypersonic missile Tayfun Block-4
సాయం చేసినవారికే మోసం చేసే లక్షణం కలిగిన దేశంగా టర్కీ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2023లో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారత్ సాయం చేసింది. కానీ భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన దాడుల్లో టర్కీ పాకిస్థాన్‌కు సపోర్ట్ ఇచ్చింది. అంతేకాదు భారత్‌పై పాక్ ప్రయోగించిన డ్రోన్లు కూడా టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నవే. అయితే తాజాగా టర్కీకి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఆ దేశంలో తొలి హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి టేఫన్ బ్లాక్ 4 ను ప్రదర్శించారు.
Also Read: డిజిటల్ అరెస్ట్.. ఇద్దరు మహిళలను నగ్నంగా కూర్చోబెట్టిన సైబర్ కేటుగాడు
టర్కీకి చెందిన ప్రముఖ రక్షణ సంస్థ రోకెట్సాన్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే అధునాతన బాలిస్టిక్ క్షిపణులలో ఒకటి. దీని బరువు దాదాపు 2300 కిలోలు ఉంటుంది. పొడవు 6.5 మీటర్లు. 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యంపై కూడా ఈ క్షిపణి దాడులు చేయగలదు. అంతేకాదు శత్రువు వాయు రక్షణ వ్యవస్థ నుంచి తప్పించుకోగలదు. టెఫున్ బ్లాక్ 4 కేవలం కొత్త తరం క్షిపణి మాత్రమే కాదు. టర్కీ జాతీయ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగమేనని రోకెట్సాన్ సంస్థ తెలిపింది.
Also Read: హెచ్ 1 బీ వీసాదారులపై మరో దెబ్బ..గ్రేస్ పిరియడ్ లో ఉంటే ఇంటికే..
ఇది టైఫున్ సిరీస్‌కు అత్యంత అధునాతన వెర్షన్. ఈ క్షిపణికి కమాండ్ కంట్రోల్ సెంటర్లు, వైమానికి రక్షణ వ్యవస్థలు, సైనిక హ్యాంగర్లు, ఇతర సైనిక నిర్మాణాలు నాశనం చేయగల సామర్థ్యం ఉంది. అయితే ఇలాంటి క్షిపణిని పాకిస్థాన్‌కు రాబోయే రోజుల్లో టర్కీ ఎగుమతి చేయనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో కూడా డ్రోన్లు అనేక ఆయుధాలను టర్కీ పాక్‌కు అందించింది. మరోవైపు ఇటీవల బంగ్లాదేశ్‌తో కూడా సంబంధాలు మెరుగుపర్చుకుంది.