Children Selling Gang : మగ శిశువుకు 6 లక్షలు...ఆడ శిశువుకు 4 లక్షలు ..పసిపిల్లల విక్రయంలో బిగ్‌ట్విస్ట్
పసి పిల్లలను ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధమున్న 11 మంది నిందితులను గత నెలలోనే కటాకటాల్లోకి నెట్టారు. అయితే కస్టడీలో వారిచ్చిన సమాచారం మేరకు పలువురిని అరెస్ట్ చేశారు.