BED PAPER LEAK CASE: బీఈడీ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంలో వారి హస్తం..పలువురు అరెస్ట్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంలో ముగ్గురు నిందితులను పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటన వెలుగులోకి రాగా యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య జి.సింహాచలం  పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

New Update
BED PAPER LEAK CASE

BED PAPER LEAK CASE

BED PAPER LEAK CASE: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంలో ముగ్గురు నిందితులను పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటన వెలుగులోకి రాగా యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ ఆచార్య జి.సింహాచలం  పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెండో పరీక్షా పత్రం అరగంట ముందుగా సామాజిక మాధ్యమాలలో వచ్చిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న పల్నాడు జిల్లాలోని ఓ బీఈడీ కళాశాలకు చెందిన ముగ్గురుతో పాటు ఒడిశాకు చెందిన 9 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.

Also Read :  రోహిత్ శర్మ ఆస్తులెంత.. ఒక్కో మ్యాచ్ కు జీతం ఎంత తీసుకుంటాడు?

విశ్వసనీయ సమాచారం మేరకు పరీక్షా పత్రాన్ని ఓ వ్యక్తి తన ఫోన్ ద్వారా ఎక్కువ గ్రూప్​లకు పంపించినట్లు ఏఎన్​యూలోని ఓ ఉన్నతాధికారి పెదకాకాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నెంబరు ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని పంపించిన వ్యక్తిని పోలీసులు తెనాలిలో అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. తనకు రేపల్లె పరిధిలోని ఓ కళాశాల నుంచి వచ్చిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెపల్లెలోని ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి ప్రశ్నించారు.తనకు పల్నాడు జిల్లాలోని ఓ బీఈడీ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్​గా పనిచేస్తున్న స్వర్ణరాజు ద్వారా బయటకు వచ్చిందని అతడు చెప్పాడు. పెదకాకాని పోలీసులు స్వర్ణరాజుతో పాటు మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా కళాశాల యజమాని ఆదేశంతోనే తొలుత ఒడిశా ఏజెంట్​లకు, తరువాత అక్కడ్నుంచి విద్యార్థులకు పంపించారు. ఇలా ఒడిశా విద్యార్థులందరికీ క్షణాల్లోనే చేరింది. ఈ కళాశాలకి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ విభాగం నుంచి పెద్దఎత్తున సహకారం లభించినట్లు తెలిసింది.

Also Read: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

పల్నాడు జిల్లాలోని బీఈడీ రికార్డుల మూల్యాంకనాన్ని ఈ కళాశాల యాజమాన్యానికే అప్పగించారు. ఇదే యాజమాన్యానికి చెందిన కళాశాలలనే ANU అధికారులు పరస్పర మార్పిడి ద్వారా తాజాగా పరీక్షా కేంద్రాలు కేటాయించారు. గత సెమిస్టర్ పరీక్షలలోనూ ఈ కళాశాలకు చెందిన యజమాని చెప్పినట్లు నాగార్జున వర్సిటీ అధికారులు నడుచుకున్నారనే ప్రచారం సాగుతోంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. వినుకొండలోని శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా పేపర్ లీక్ అయ్యిందని పోలీసులు తెలిపారు. బిఈడీ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పేపర్ లీక్ చేసారన్నారు. ఈ నేరానికి సంబంధించిన పదిమందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పరీక్ష పేపర్  సాఫ్ట్ కాపీని ఒకరోజు ముందు కాలేజీ కి పంపుతారు. పరీక్షకు అరగంట ముందు పాస్ వర్డ్ తెలియజేస్తారని తెలిపారు.

ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ

Also Read: Mark-carney: కెనడా కొత్త ప్రధానిగా మార్క్‌!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు