AP Crime: ప్రకాశం జిల్లాలో కలకలం.. 4వ తరగతి చిన్నారి కిడ్నాప్!

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడులో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక అంజలిని గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో కిడ్నాప్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

New Update
Kidnapping

Kidnapping

AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఆసక్తికరమైన కిడ్నాప్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దేవీపట్నంలో శరభవరంలో పనిచేస్తున్న ఓ మహిళా వెల్ఫేర్ అసిస్టెంట్‌ని ఆమె వివాహానికి నిరాకరించిన వ్యక్తి, అతని ఐదుగురు అనుచరులు కిడ్నాప్ చేశారు. చిలకలూరిపేటలో ఓ ధనవంతుడి కుమారుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇలా రాష్ట్రంలో ఏదో ఓ మూలన కిడ్నాప్‌ కేసులు ప్రజలను భయానికి గురి చేస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు అందగానే.. ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపి.. సాంకేతిక ఆధారాలను ఉపయోగించారు. మహిళను, బాలుడిని సురక్షితంగా రక్షించి.. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులు స్థానికంగా కలకలం సృష్టించింది.  కొన్ని గంటల్లోనే ఈ సంఘటన భయాందోళనలు సృష్టించినప్పటికీ... పోలీసులు వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరో చిన్నారి కిడ్నాప్‌ కలకలం రేపింది.

చిన్నారి క్షేమం..

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడులో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక అంజలిని గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో కిడ్నాప్ చేశారు. బాలిక స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాచర్ల పోలీసులు విచారణ చేపట్టారు.ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించి వెంటనే అప్రమత్తం కావాలని పోలీసులను ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో కిడ్నాపర్లు పోలీసుల తనిఖీలను చూసి భయపడి దేవరాజు గట్టు చెక్ పోస్ట్ వద్ద బాలికను వదిలి పారిపోయారు.బాలికను సురక్షితంగా పోలీసులు చేర్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.


ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్ లోయలో పడి 8 మంది మహిళలు మృతి

బాలిక క్షేమంగా ఇంటికి రావాటంతో కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ వెనుక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాలిక అపహరణకు గురైన విషయం తెలిసి కూడా పోలీసులు వేగంగా స్పందించి చిన్నారిని కాపాడటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: నరికింది అల్లుడే.. కుక్క నోట్లో తెగిన అత్త  చెయ్యి.. వీడిన మిస్టరీ!

Advertisment
తాజా కథనాలు