/rtv/media/media_files/2025/06/30/uttar-pradesh-firozabad-rape-of-10-year-old-girl-2025-06-30-17-45-34.jpg)
Nandyal Crime News
AP Crime: చిన్నాన్న అంటే నాన్న తర్వాత నాన్న లాంటివాడు. అతనిలో ప్రేమా, ఆప్యాయతలను పిల్లలు చూస్తారు. తమ తండ్రిని దగ్గరకు తీసుకున్నట్లే వారిని దగ్గర తీసుకుంటారు. చిన్నాన్న కూడా కన్న బిడ్డలాగా ఆ పిల్లల ఆలనా పాలన పట్ల శ్రద్ధ పెడతాడు. కానీ రోజులు మారుతున్నాయి. సమాజంలో నైతిక విలువలు పోతున్నాయి. ఆడ, మగ అనే తేడా లేకుండా వావి వరసలు మరచి ప్రవర్తిస్తున్నారు. పశువుల్లాగా మారి బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలను నవ్వులపాలు చేస్తున్నారు. తమ వెకిలి చేష్టలతో సమాజానికి తల వంపులు తెస్తున్నారు. అక్రమ సంబంధాలు, అదుపు చేసుకోలేని కోరికలు కామాన్ని పెంచితే.. ఆ కామంతో చేయకూడని తప్పులు చేస్తున్నారు. సమాజం తలదించుకునేలాంటి అటువంటి ఘటన ఒకటి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందులూరులో జరిగింది.
పసితనం బదులు ఆడతనం చూపులు..
వివరాల్లోకి వెళ్తే.. రుద్రవరం మండలం మందలూరులో ఓ 13 ఏళ్ళ బాలిక తన కుటుంబంతో నివాసం ఉంటోంది. పేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులకు సాయంగా ఉండేందుకు చిన్నచిన్న పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు చిన్నాన్న వరుస అయ్యే వ్యక్తి తరచూ బాలిక ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. బాలిక కూడా అతన్ని తండ్రిగా భావిస్తూ మంచి మర్యాదలు ఇచ్చేది. అతని మాటలను నమ్మేది. తన తండ్రి మాటను ఎలాగైతే పాటించేదో అలానే అతని మాటలను అనుసరించేది. ఆ బాలిక అమాయకత్వాన్ని అదనుగా భావించి చిన్నాన్న వరుసయ్యే వ్యక్తి తన చెడు ఆలోచనకు పదును పెట్టి ఆ బాలికపై కన్నేశాడు. కామం అతని కళ్ళను మూసేశాయి. ఆ బాలికలో పసితనం బదులు ఆడతనం చూశాడు. ఎలాగైనా తన కోరికను తీర్చుకోవాలని అనుకున్నాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన సదరు వ్యక్తికి ఆ బాలిక తన కూతురు వరుస అనే ఆలోచన కూడా రావడం ఆగిపోయింది.
ఈ క్రమంలో కూలి పనుల కోసం తీసుకెళ్తానని బాలిక కుటుంబ సభ్యులను నమ్మించాడు. చిన్నాన్న వరుసే కాబట్టి ఏమి కాదులేనని వారు కూడా అతనితో బాలికను పనులకు పంపించారు.
ఇది కూడా చదవండి: బలవంతంగా ఊపిరి వదిలిన 13ఏళ్ళ బాలిక.. ముక్కలైన శరీర భాగాలు
అదే వారు చేసిన పాపం అయ్యిందేమో. ఆ వ్యక్తి కూతురు లాంటి బాలికలో ఆడతనం చూసి వావి వరసలు మరచిపోయాడు. తన కోరికను తీర్చుకోవడానికి నయానో, భయానో బాలికను లొంగదీసుకున్నాడు. ఆమెపై చేయకూడని పనులను చేసి మానవత్వ విలువలను మంట గలిపాడు. సభ్య సమాజం తలదించుకునేలా పాడు పని చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఏమి తెలియని పసితనం.. తనకేం జరిగిందో అనే అయోమయం.. ఒంటి నొప్పులు రావడంతో బాధను భరించలేకపోయిన బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఎంతో బాధకు గురి అయ్యారు. తెలిసినవాడని నమ్మి పంపితే ఇంతటి దారుణానికి ఒడిగడతాడా అని తల్లడిల్లిపోయారు. విలువలు మరచి కామంతో క్రూరంగా వ్యవహరించిన ఆ వ్యక్తిపై ఆగ్రహానికి గురయ్యారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రుద్రవరం పోలీసు స్టేషనుకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. తమ బిడ్డకు జరిగిన ఘోరాన్ని చెప్పుకొని కన్నీరుమున్నీరయ్యారు. వారి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు. కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల కోసం బాలికను ఆళ్ళగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
( ap crime latest updates | ap-crime-news | Latest News | telugu-news)
ఇది కూడా చదవండి: జడ్చర్లలో ఘోరం.. ఏడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం!