/rtv/media/media_files/2025/01/28/F84UXyQn9pNJIJZ4Tpv6.webp)
Anantapur Crime News
వరకట్నం వేధింపులు భారతదేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న ఒక తీవ్రమైన సామాజిక సమస్య. వివాహం అనేది ప్రేమ, గౌరవం ఆధారంగా ఉండాల్సింది పోయి.. ఆర్థిక లావాదేవీగా మారుతోంది. పెళ్లి సమయంలో ఆ తర్వాత కూడా అత్తింటివారు మరింత కట్నం కోసం మహిళలను మానసికంగా, శారీరకంగా హింసించడం జరుగుతుంది. ఈ వేధింపులు చాలా మంది మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాయి, కొందరిని ఆత్మహత్యలకు కూడా ప్రేరేపిస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ.. సమాజంలో అవగాహన పెంచడం, కట్నం తీసుకోవడం, ఇవ్వడం వంటి వాటిని వ్యతిరేకించడం చాలా అవసరం. అయితే తాజాగా ఏపీలో కట్నం వేధింపులతో ఓ మహిళలు ప్రాణాలు తీసుకుంది.
అనుమానంతో హింసించడం వల్లనే..
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. కట్నం, భర్త అనుమానంతో వేధింపులు తాళలేక శ్రావణి అనే మహిళ బలవన్మరణంకు పాల్పడింది. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తన తల్లిదండ్రుల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు శ్రావణి తన బాధను వాయిస్ రికార్డు రూపంలో రికార్డు చేసి.. తన ఆవేదనను తెలియజేసింది. వాయిస్ రికార్డులో శ్రావణి మాట్లాడుతూ.. నేను కడుపులో పెరుగుతున్న మూడు నెలల బిడ్డతో వెళ్ళిపోతున్నాను. పోలీసులు నాకు న్యాయం చేయలేదు. కనీసం నా మొదటి బిడ్డకైనా న్యాయం చేయండి అంటూ కన్నీరు పెట్టుకుంది. తన భర్త శ్రీనివాసులు, అత్తమామలు అనుమానంతో, కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది.
ఇది కూడా చదవండి: బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి స్పాట్‌లోనే 10 మందికి..
శ్రావణికి నాలుగేళ్ల క్రితం శ్రీనివాసులుతో వివాహం జరిగింది. పెళ్లైన మొదటి ఆరు నెలలు వారి కాపురం అన్యోన్యంగా సాగింది. ఆ తరువాత అత్తమామలు, భర్త కట్నం కోసం వేధించడం ప్రారంభించారని, అనుమానంతో హింసించడం మొదలుపెట్టారని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ వేధింపులు తట్టుకోలేక శ్రావణి తన పుట్టింటికి వచ్చి విషాద నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై శ్రావణి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి వాయిస్ రికార్డును ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. కట్నం వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దుర్ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇది కూడా చదవండి: ఆర్కే బీచ్‌లో విషాదం.. అలల తాకిడికి ఓ కుటుంబం...