బడ్జెట్ పేరుతో మోసం | MLC Varudu Kalyani Comments On AP Budget | Chandrababu | Pawan Kalyan | RTV
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విజన్ లేదు, విజ్డం లేదని టీపీసీసీ షర్మిల అన్నారు. కేవలం ఇంద్రజాలమే తప్పా మిషన్ లేదు మీనింగ్ లేదు అంతా మహేంద్రజాలమే అని విమర్శించారు. రాష్ట్రం గుల్ల బడ్జెట్ అంతా డొల్ల అంటూ పోస్ట్ పెట్టారు.
ఏపీ బడ్జెట్లో తొలిసారిగా తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. తెలుగు భాషాభివృద్ధికి దాదాపు రూ.10 కోట్లు కేటాయించడం విశేషం. అందులో నవోదయం 2.0 స్కీం కింద మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం కేటాయింపు చేసారు.
రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కు రూ.9,400 కోట్లను కేటాయించారు. విత్తన రాయితీ, వడ్డీలేని రుణాలతో పాటు కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు అత్యధికంగా రూ.48 వేల కోట్లను కేటాయించారు. ఆ తర్వాత బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు, వైద్య శాఖకు రూ.19,264 కోట్లు, పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, పంచాయతీ రాజ్ కు రూ.18,847 కోట్లు, జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు దక్కాయి.
ఏపీ బడ్జెట్లో డ్రిప్ ఇరిగేషన్కు పెద్ద పీట వేశారు. 85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు మంత్రివర్గం అమోదించింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి పయ్యావుల తెలిపారు.
2025- 26 రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. పంచాయతీ రాజ్ 18,848 కోట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీకి 796 కోట్లు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీశాఖకు భారీ నిధులు విడుదల చేయనున్నారు.
ఏపీ బడ్జెట్ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం ఈ ఏడాదే అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
ఏపీ బడ్జెట్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు భారీగా నిధులు కేటాయించారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్ వ్యవసాయ శాఖకు రూ.11636 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31,806 కోట్లు కేటాయించారు.