/rtv/media/media_files/2025/02/28/81Tx1T1jkvz334iOLAVH.jpg)
AP Budget 2025-26
AP Budget: ఏపీ బడ్జెట్‌లో డ్రిప్ ఇరిగేషన్‌కు పెద్ద పీట వేశారు. 85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు మంత్రివర్గం అమోదించింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధ చేయనున్నారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు వంటి 30 వేల పనులను ఇప్పటికే మంజూరు చేసినట్టు బడ్జెట్ లో మంత్రి పయ్కావుల వెల్లడించారు.
72 లక్షల మందికి ఉపాధి..
ఈ మేరకు 4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన CC రోడ్లల్లో ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల పూర్తైనట్లు తెలిపారు. మిగిలిన 1300 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నట్టు బడ్జెట్ లో ప్రస్తావించారు. నరేగా ద్వారా 72 లక్షల మందికి ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. పోలవరం-బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 200 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించేలా పనులు చేపట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
ఇప్పటికే హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల వెడల్పు చేసే పనులు ప్రారంభమైనట్టు బడ్జెట్ సమావేశంలో స్పష్టం చేశారు. పాట్‌హోల్ ఫ్రీ ఆంధ్ర నినాదంతో గణనీయమైన పురోగతి సాధిస్తున్నామన్నారు. మరమ్మత్తులు చేపట్టిన 20,059 కిలోమీటర్లలో 17,605 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు 3 నెలల వ్యవధిలోనే పూర్తి చేసినట్టు తెలిపారు.
Also Read: Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!