AP budget: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు!

ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు భారీగా నిధులు కేటాయించారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్ వ్యవసాయ శాఖకు రూ.11636 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31,806 కోట్లు కేటాయించారు.

New Update
ap budget  2123

ap budget 2123 Photograph: (ap budget 2123)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ఈ క్రమంలో సూపర్ సిక్స్ పథకాలకు భారీగా కేటాయింపులు చేసింది. అన్నదాత సుఖీభవ కోసం రూ.6300 కోట్లు, తల్లికి వందనం పథకం కోసం రూ.9407 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై మండలిలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్, మే మాసాల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నామని కౌన్సిల్ సాక్షిగా చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ క్రమంలోనే విద్యా, వ్యవసాయ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ప్రతి బిడ్డకు రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిచనున్నారు.

Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!

మొత్తం బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల 359 కోట్లు కాగా.. వ్యవసాయానికి ప్రత్యేకంగా రూ.48 వేల కోట్ల బడ్జెట్ ప్రకటించింది. రైతులకు అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్‌ ల లబ్ధిదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు 11636 కోట్లు కేటాయించింది. పాఠశాల విద్యాశాఖ 31 వేల ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు. 

Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!

అన్నదాత సుఖీభవ..

కొన్ని రోజుల్లో తల్లికి వందనంతో పాటు రైతు భరోసా స్కీమ్ లు అమల్లోకి రానున్నాయి. రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు 20వేల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. తాజాగా ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త చెప్పారాయన. రాష్ట్ర రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం సిధ్ధంగా ఉందన్నారు చంద్రబాబు. త్వరలో అన్నదాత సుఖీభవ అమలు చేస్తామన్నారు చంద్రబాబు. కేంద్రం అందించే 6వేలతో పాటు అదనంగా రూ. 14,000ను మూడు విడతల్లో రైతులకు చెల్లిస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు