/rtv/media/media_files/2025/02/28/SWpQ1GU2b3jSYNtzKeBu.jpg)
AP Budget 2025- 26
AP Budget 2025- 26: రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) శాఖలకు భారీగా నిధులు కేటాయించారు. పంచాయతీ రాజ్(Panchayat Raj) 18,848 కోట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీకి 796 కోట్లు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీశాఖకు భారీగా నిధులు కేటాయించారు. పంచాయతీ రాజ్ 18,848 కోట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ 796 కోట్లు, యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలకు నిధులు కేటాయించారు. ఇక 2025-26 వార్షిక బడ్జెట్ రూ.3 లక్షల 22 వేల 359 కోట్లు. కాగా ఏపీ బడ్జెట్ తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటింది. రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్, వయబులిటీ గ్యాఫ్ ఫండ్ రూ.2 వేలకోట్లు, మూలధనం అంచనా వ్యయం రూ.40,635 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా కేటాయించారు.
Also Read: Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
బడ్జెట్ మొత్తం రూ.3,22,359 కోట్లు..
ఏపీ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల అంసెబ్లీలో ప్రవేశపెట్టారు. 3లక్షల 22వేల 359 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ కేటాయించారు. అత్యధికంగా అమరావతి నిర్మాణానికి 6వేల కోట్లు, వ్యవసాయానికి 48 వేల కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31, 806కోట్లు కేటాయించారు. పురపాలక శాఖకు 13862 కోట్లు, ఇంధన శాఖకు రూ 13,600 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. వ్యవసాయ శాఖకు 11636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు, రవాణా శాఖకు 8785 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
అలాగే ఏపీ బడ్జెట్ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని ప్రకటించారు. ఈ పథకం వల్ల మధ్యతరగతి, పేద ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని తెలిపారు. ఇక ఆరోగ్యశాఖకు రూ.19264 కోట్లు కేటాయించారు.