Fire Accident: తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెన్నేపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు సిబ్బంది చిక్కుకోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.
Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
న్యూ ఇయర్ వేడుకల కోసం కడప నుంచి గండికోటకు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. జమ్మలమడుగు దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది.
AP: ఆంధ్రాలో ఉగాది నుంచి ఫ్రీ బస్సు!
సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిచనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు.
Kadapa: పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐపై దాడి
వైఎస్సార్ జిల్లాకి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. పోలీసులు వెంటనే కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. అయితే యాక్సిడెంట్‌కి కారణమైన వారిని ఎస్ఐ వదిలేశాడని గాయపడిన వారి కుటుంబ సభ్యులు అతనిపై దాడికి పాల్పడ్డారు.
BIG BREAKING: ఫైళ్ల దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక వ్యక్తి అరెస్ట్!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసు కీలకమలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌ను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు.
CM Chandrababu: తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలకు చంద్రబాబు శుభవార్త!
తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ సీఎంతో భేటీ అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని తెలిపారు.
Ambati Rambabu: మీ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది: పవన్‌పై అంబటి సెటైర్!
పవన్ కళ్యాణ్‌పై అంబటి రాంబాబు సెటైర్ వేశారు. సంధ్య థియేటర్ ఘటన జరిగిన 27 రోజుల తరువాత నోరు మెదిపి.. మీ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నందుకు సంతోషం అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించిన అనంతరం అంబటి ట్వీట్ చేశారు.
New Chief Secretary: నూతన సీఎస్‌గా ఆయనే.. ఫైనల్ చేసిన సీఎం చంద్రబాబు!
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రేసులో సాయిప్రసాద్, విజయానంద్ పేర్లు వినిపించాయి. కానీ సీఎం చంద్రబాబు విజయానంద్ నియమకాన్ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. రేపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.