తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇలా!

తెలుగు రాష్ట్రాల్లో మూడు టీచర్  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.  మరో మూడు (ఏపీలో రెండు, తెలంగాణలో ఒకటి ) గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది.  

New Update
malka

తెలుగు రాష్ట్రాల్లో మూడు టీచర్  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.  మరో మూడు (ఏపీలో రెండు, తెలంగాణలో ఒకటి ) గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది.  

ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు.  ఏపీటీఎఫ్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రఘువర్మపై ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. రఘువర్మ ఇప్పటికే ఓటమిని అంగీకరించారు.  

గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. 50 శాతానికిపైగా ఓట్లు సాధించి విజయం ఖరారు చేసుకున్నారు. ఏడు రౌండ్లు ముగిసేసరికి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్‌పై రాజా 67 వేల252 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం 2,41,873 ఓట్లలో 1,18,070 ఓట్లు రాబట్టారు. చెల్లని ఓట్లు 21వేల 577 ఉన్నాయి.

వరంగల్ - ఖమ్మం - నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. 13,969 ఓట్లు సాధించిన శ్రీపాల్ రెడ్డి.. 19వ రౌండ్ లో తాజా మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పై విజయం సాధించారు శ్రీపాల్ రెడ్డి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే  ఫలితం తెలింది. 

Also read :   40 ఏళ్లుగా పరారీలో..పోలీసులకే చుక్కలు చూపించాడు.. చివరకు.. !

మల్క కొమురయ్య విజయం

వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోదండరాం మద్దతు ఇచ్చిన పన్నాల గోపాల్ రెడ్డికి 24 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు.  

 శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో పది మంది పోటీ చేయగా.. ఎనిమిది మందిని ఎలిమినేట్‌ చేయడంతో శ్రీనివాసులు నాయుడు విజయం దాదాపుగా ఖాయమైట్లేనని తెలుస్తోంది.

Also read :  పెళ్లై ఇద్దరు పిల్లలు, హిమానితో లవ్.. కాంగ్రెస్ మహిళా కార్యకర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు