BREAKING: ఐపీఎస్ అధికారిపై ఏసీబీ కేసు నమోదు
ఐపీఎస్ అధికారి సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ నివేదిక ఇచ్చింది. దీంతో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ అధికారులు సంజయ్‌పై కేసు నమోదు చేశారు.