ఏపీ పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 8వ తేదీ నుంచి 10 తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. ఈ పరీక్షలను జనవరి 11వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి, శాంతి భద్రతల దృష్ట్యా ఈ దేహదారుఢ్య పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. ఇది కూడా చూడండి: కేటీఆర్కు ఏసీబీ అధికారులు బిగ్ షాక్... హైకోర్టులో పిటిషన్ ! మొత్తం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి.. గత ప్రభుత్వం మొత్తం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022లో వచ్చి ఈ నోటిఫికేషన్‌కి 2023లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. దీనికి మొత్తం 4,59,182 మందిహాజరు కాగా ..95,208 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. అయితే ఫిజికల్ టెస్ట్‌కు 91,507 మంది అభ్యర్ధులు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: Murder: అహ్మదాబాద్‌లో దారుణం.. రూ.10 వేల కోసం యువకుడిని.. 2023లోనే దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశారు. కానీ పట్టభద్రుల ఎన్నికలు కావడంతో వాటిని వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ షెడ్యూల్‌ను విడదుల చేయలేదు. దీంతో ఇప్పటి వరకు అది వాయిదా పడింది. ఇది కూడా చూడండి: HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే ఇది కూడా చూడండి: KTR: నా ఇంటి మీద రైడ్స్కు రేవంత్ కుట్ర .. కేటీఆర్ కీలక కామెంట్స్