Andhra Pradesh budget: ఫస్ట్ టైం పెన్‌డ్రైవ్‌లో ఏపీ బడ్జెట్ వివరాలు !!

2025-26 ఏపీ బడ్జెట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి సారిగా బడ్జెట్ పత్రులను ముద్రించకుండా పెన్‌డ్రైవ్‌ రూపంలో పంపించనున్నారు. ప్రస్తుత బడ్జెట్‌ పుస్తకాల ముద్రణకు స్వస్తి పలికింది. పద్దుల వివరాలు పెన్‌డ్రైవ్ రూపంలో సభ్యులకు, మీడియాకు ఇవ్వనున్నారు.

New Update
budget pendrive

budget pendrive Photograph: (budget pendrive)

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం (ఈరోజు) 10 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2025-26 బడ్జెట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి సారిగా బడ్జెట్ పత్రులను ముద్రించకుండా పెన్‌డ్రైవ్‌ రూపంలో పంపించనున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పైయ్యావుల కేశవులు బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చారు. కేబినెట్ మీటింగ్‌లో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కొత్త సంస్కరణ తీసుకువచ్చింది. ప్రస్తుత బడ్జెట్‌ పుస్తకాల ముద్రణకు స్వస్తి పలికింది. పద్దుల వివరాలు పెన్‌డ్రైవ్ రూపంలో సభ్యులకు, మీడియాకు ఇవ్వనున్నారు. 

Also Read: Ravi Praksh: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

ఆర్థిక మంత్రి శాసనసభలో బడ్జెట్ ప్రసంగం చేస్తారు. సభలో బడ్జెట్ చదివే సమయంలో సభ్యులు చూసుకునేందుకు వీలుగా ఆ ప్రసంగం పుస్తకం ఒక్కటే ముద్రించి శాసనసభ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. బడ్జెట్‌కు సంబంధించి అనేక వివరాలతో 28 రకాల పుస్తకాలు ముద్రించేవారు. వీటితో పాటు ప్రతి ప్రభుత్వశాఖ తన మంత్రిత్వశాఖ అంశాలతో పుస్తకాలు వెలువరించేవి. బడ్జెట్ డిమాండ్లు, గ్రాంట్లు, బడ్జెట్ స్వరూపం అన్న పేరుతో ఈ శాఖ కేటాయింపులు ఒక పుస్తకం , అప్పటి వరకు ఆ ప్రభుత్వ శాఖ సాధించిన ఫలితాలతో ఒక పుస్తకం ప్రింట్ చేసేవారు. వాటిని తెలుగు, ఆంగ్లంలో కూడా ముద్రించేవారు. ప్రస్తుతం పెరిగిన టెక్నికల్ కారణంగా బడ్జెట్ ప్రతులు ముద్రించడం ఆపేశారు. 

Also Read: AP: ఓబులవారి పల్లె పీఎస్ ముగిసిన పోసాని విచారణ

వీటి వ్యయం చాలా ఎక్కువ ఉంటోందని ఆర్థికశాఖ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో వాటి ముద్రణకు స్వస్తి పలికి ఖర్చు తగ్గించుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో చర్చించి  నిర్ణయం తీసుకున్నారు.


Advertisment
తాజా కథనాలు