Amit Shah : అమిత్ షాపై కేసు నమోదు.. ఏ3గా చేర్చిన పోలీసులు
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మొఘల్‌పురా పోలీస్ స్టేషన్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. పోలీసులు ఏ3గా అమిత్ షా పేరును చేర్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమిత్ షాపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు.