Accident: ఘోరమైన బైక్ యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం!

యూపీ ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా సైయన్ ప్రాంత నివాసితులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రాజ్‌వీర్ సింగ్ తెలిపారు.

New Update
accident

accident Photograph: (accident)

Accident: యూపీ ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా సైయన్ ప్రాంత నివాసితులుగా పోలీసులు గుర్తించారు. 

ఇంటికి తిరిగి వస్తుండగా..

ఈ మేరకు స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బంధువుల పెళ్లి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకే హీరోహోండా మోటార్ సైకిల్‌పై వస్తున్న నలుగురు ఎదురుగా వస్తున్న బుల్లెట్ బైక్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో  భగవాన్ దాస్ (35), వకీల్ (35), రామ్ స్వరూప్ (28), సోను (30) అక్కడిక్కడే చనిపోయారు. బుల్లెట్ పై వస్తున్న ఇద్దరిలో ఒకరు చనిపోగా.. బండి నడుపుతున్న 17 ఏళ్ల కరణ్  పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించాం. వీరంతా సైయన్ ప్రాంత నివాసితులే అని పోలీసులు వెల్లడించారు. 

Also read : AP Assembly: కళ్లు చదిరేలా ఏపీ హైకోర్టు, అసెంబ్లీ భవనాలు.. టెండర్లుకు నోటిఫికేషన్

మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి పంపినట్లు కాగరౌల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (క్రైమ్) రాజ్‌వీర్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు చనిపోవడంతో ఆ ఊర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. 

Also Read :  చర్చ్ ముందే నలుగురు మృతి.. హైటెన్షన్ వైర్లకు తగిలి మలమల మాడిపోయారు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు