/rtv/media/media_files/2025/10/11/agra-2025-10-11-20-06-27.jpg)
కట్టుకున్న భర్తలను భార్యలు తమ ప్రియుడితో కలిసి చంపేస్తున్న ఈ తరుణంలో ఓ భర్తతో కలిసి ఇద్దరు భార్యలు కలిసి కర్వా చౌత్ పండగను కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆగ్రాలోని ఎత్మదౌలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
వీరి కుటుంబం నగ్లా బిహారీలో నివసిస్తోంది. భర్త రామ్ బాబు నిషాద్ తన ఇద్దరు భార్యలు - శీలా, మన్ను దేవితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలలో, ఇద్దరు భార్యలు సాయంత్రం పూజ కోసం కలిసి కూర్చోవడం, చంద్రునికి ప్రార్థనలు చేయడం, చివరకు తమ భర్త చేతుల మీదుగా నీరు తాగి వ్రతాన్ని ముగించడం కనిపిస్తుంది.
మన్ను దేవితో ప్రేమలో
రామ్ బాబు దాదాపు పదేళ్ల క్రితం శీలా దేవిని వివాహం చేసుకున్నారు, వారికి పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలం తర్వాత, ఆయన మన్ను దేవితో ప్రేమలో పడ్డారు. ఈ విషయం ఇంట్లో తెలిసినప్పుడు, ఎలాంటి గొడవలు జరగకుండా, కుటుంబ సభ్యులు ఒక అవగాహనకు వచ్చారు. శీలా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో రామ్ బాబు తరువాత మన్ను దేవిని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరంతా కలిసి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, అక్కడ గొడవకు తావుండదని రామ్ బాబు అన్నారు.
కర్వా చౌత్ అనేది ప్రధానంగా ఉత్తర దేశంలో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వివాహిత మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ. వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పెళ్లికాని యువతులు కూడా మంచి భర్త లభించాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తారు.
Also Read: ఇదిరా కంపెనీ అంటే.. ఉద్యోగులకు 9 రోజులు దీపావళి సెలవులు
Follow Us