Actress Hema : నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ
రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు తన పేరును ఛార్జిషీట్లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు తన పేరును ఛార్జిషీట్లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
నటి హేమకు ఊరట లభించింది. బెంగుళూర్ రేవ్ పార్టీ వార్తల నేపథ్యంలో ఆమెపై విధించిన సస్పెన్షన్ ను 'MAA' ఎత్తివేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు లేఖను విడుదల చేశారు. అలాగే పరిస్థితుల కారణంగా స్పెన్షన్, దాని ఎత్తివేత గురించి మీడియాతో చర్చించకూడదని తెలిపారు.
నటి హేమ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తనను ఒక టెరరిస్ట్లాగా మీడియా ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. కొందరు మీడియా ప్రతినిధులు తనను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. కొంతమంది సెటిల్మెంట్ కు కూడా రమ్మని అడిగారని వీడియోలో హేమ ఆవేదన వ్యక్తం చేసింది.
టాలీవుడ్ సినీనటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆమె బెయిల్పై బయటకు వచ్చింది. తాజాగా, నాడు స్వామివారిని దర్శించుకున్నహేమను మీడియా ప్రతినిధులు రేవ్ పార్టీ విషయంపై ప్రశ్నించారు. ఆమె స్పందిస్తూ.. అసలేం జరిగిందనేది మీకే తెలియాలి అంటూ సెటైర్లు వేసింది.
బెంగళూరు జైలు నుంచి సినీనటి హేమ విడుదలైంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ నటి హేమకు 'మా' అసోసియేషన్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. హేమను సస్పెండ్ చేసేందుకు మా సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బుర్ఖా ధరించి వైద్య పరీక్షలు చేయించుకున్న నటి వీడియో వైరల్ అవుతోంది. రేపు హేమను అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మ కొట్టింది. వైరల్ ఫివర్ తో బాధపడుతున్నట్లు సీసీబీకి లేఖ రాసింది. విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరింది. హేమ లేఖను పరిగణలోకి తీసుకోని సీసీబీ ఆమెకు మరో నోటీసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొనగా..వారిలో 86 మంది మాదకద్రవ్యాలను తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. వారిలో టాలీవుడ్ కు చెందిన నటి హేమ కూడా ఉంది. ఈరోజు ఆమెతో కలిసి మొత్తంగా ఎనిమిది మందిని విచారణకు సోమవారం హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.