Actress Hema : నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ

రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు తన పేరును ఛార్జిషీట్‌లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

author-image
By V.J Reddy
New Update
actress hema

Actress Hema: బెంగళూరు డ్రగ్స్ కేసులో తన పేరును పోలీసులు ఛార్జిషీట్‌లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని అన్నారు. బెంగళూరు పోలీసుల ఛార్జిషీట్‌లో తన పేరు వచ్చినట్టు తెలిసిందని.. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని చెప్పారు. ఛార్జిషీట్‌ తనకు వచ్చాక దీనిపై స్పందిస్తానని అన్నారు. తనకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్‌లో నెగిటివ్ అని ఛార్జిషీట్‌లో వేసినట్లు తెలుస్తుందని అన్నారు. MDMA డ్రగ్స్ తాను తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.

1,086 పేజీల ఛార్జ్‌షీట్‌...

బెంగుళూర్ రేవ్ పార్టీ (Bangalore Rave Party) కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. నటి హేమ (Hema) బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ తీసుకున్నట్లుగా ఆధారాలు సేకరించి మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 88 మంది నిందితులను చేర్చారు. ఈ కేసుకు సంబంధించి బెంగళూర్ పోలీసులు 1,086 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.

ఇది ఇలా ఉండగా.. బెంగళూర్ రేవు పార్టీలో హేమ డ్రగ్స్ (Drugs) తీసుకున్నారనే అబియోగంతో ఆమె పై కేసు నమోదు చేయగా.. నటి హేమ మాత్రం తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాహింపు ఇవ్వాలని బెంగళూర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఇరు పక్షాల వాదోపవాదనలు విన్న కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో మళ్ళీ రేవు పార్టీ కేసులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది.

Also Read :  'హనుమాన్' మేకింగ్ వీడియో..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు