Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
వనపర్తి జిల్లా కొత్తపేట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.