Hero Nithiin : షూటింగ్ లో గాయపడిన హీరో నితిన్..చిత్రీకరణ ఆపేసిన చిత్ర బృందం!
టాలీవుడ్ హీరో నితిన్ షూటింగ్ లో గాయపడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నితిన్ తమ్ముడు అనే సినిమాను ఏపీలోని మారేడుమిల్లిలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా నితిన్ చేతికి గాయాలు కాగా డాక్టర్లు మూడు వారాల రెస్ట్ తీసుకోవాలని చెప్పారు.