/rtv/media/media_files/2026/01/31/fotojet-99-2026-01-31-21-08-01.jpg)
Aadhaar camps in schools
Aadhaar camps in schools: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల లోపు విద్యార్థులకు ఇక నుంచి స్కూళ్లలోనే ఆధార్ సర్వీస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ఱయించింది. విద్యార్థులు ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఇబ్బందులు పడకుండా.. వారికి వ్యయాప్రయాసలు తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 5 నుంచి 15 ఏళ్ల వయసున్న విద్యార్థులకు మెుదటి సారి అప్డేట్‌ను పూర్తి ఉచితంగా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఎలాంటి సేవలు పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఆధార్ కార్డుదారులు ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే ఆధార్ కేంద్రాలకు వెళ్లి ముందుగానే తమ పేరు నమోదు చేసుకోవాలి. అయితే దానికోసం అక్కడికి వెళ్తే అక్కడ ఉండే క్యూ, పట్టే సమయం వల్ల ఇతరాత్రా పనులు చేసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు బిగ్ రిలీఫ్ ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఆధార్ రిజిస్ట్రేషన్, అప్డేట్స్ కోసం ఇక నుంచి ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. పాఠశాలల్లోనే ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో స్పెషల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
అన్ని పాఠశాలల్లోనూ 5 నుంచి 15 ఏళ్ల వయసున్న విద్యార్థులు మొదటి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కు ఎలాంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా చేసుకోవచ్చు. రెండవ బయోమెట్రిక్ అప్డేట్ కోసం మాత్రం రూ.125 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేయించుకోవాలనుకుంటే రూ.75 చెల్లించాలని అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ఆధార్ మొబైల్ క్యాంపులు ఎప్పుడు? ఏ స్కూల్లో ఉంటాయో? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ అధికారిని, మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించాలని వెల్లడించారు. కాగా, రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు, టీచర్ల సంఘాలు స్వాగతిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు.
అందుబాటులోకి ఆధార్ యాప్..
మరోవైపు సరికొత్త ఆధార్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల లాంచ్ చేసింది. ఈ కొత్త యాప్‌తో ఆధార్ సర్వీసులు మరింత ఈజీగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనున్నాయి. ఈ యాప్ ద్వారా వెంటనే ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆడ్రస్, మొబైల్‌నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఆధార్ కాంటాక్ట్ కార్డ్ ద్వారా అత్యంత గోప్యంగా కాంటాక్ట్ వివరాలను కూడా పంచుకోవడానికి అవకాశం ఉంది. ఎవరికైనా ఆధార్ షేర్ చేసినప్పుడు మొత్తం వివరాలు కాకుండా అవసరమైనవి మాత్రమే కనిపించేలా యాప్‌లో ఫీచర్లు తీసుకొచ్చారు. ఈ ప్రత్యేక యాప్ ద్వారా ఐదుగురి వరకు ప్రొఫైల్ వివరాలు క్రియేట్ చేసుకునే అవకాశం కల్పించారు.
Follow Us