Aadhaar New App: ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ మార్చుకోవాలా.. కొత్త యాప్ వచ్చేసిందిగా

దేశ వ్యాప్తంగా ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఏ చిన్న పనైనా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. ఈ పనుల్లో ముఖ్యంగా ఆధార్ కార్డు ప్రామాణికంగా పరిగణించబడుతుంది. బ్యాంక్, బస్ బుకింగ్, ట్రైన్ బుకింగ్, జాబ్స్ దరఖాస్తు.. ఇలా ప్రతి పనికి ఆధార్ కార్డు ఉండాల్సిందే.

New Update
eAadhaar app launched

eAadhaar app launched

దేశ వ్యాప్తంగా ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఏ చిన్న పనైనా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. ఈ పనుల్లో ముఖ్యంగా ఆధార్ కార్డు ప్రామాణికంగా పరిగణించబడుతుంది. బ్యాంక్, బస్ బుకింగ్, ట్రైన్ బుకింగ్, జాబ్స్ దరఖాస్తు.. ఇలా ప్రతి పనికి ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇది లేకపోతే వెళ్లిన పని అస్సలు జరగదు. అయితే కొందరు తమ ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వివరాలు తప్పుగా ఉండటంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. 

స్టడీ సర్టిఫికేట్‌లో ఒకలా, ఆధార్ కార్డులో వేరేలా ఉండటంతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. దీంతో ఆధార్‌ కార్డులో తప్పుగా ఉన్న వివరాలను సరిచేసుకునేందుకు ఆధార్ సెంటర్లకు వెళ్లి గంటల కొద్దీ వెయిట్ చేసినా కొన్నిసార్లు పనిజరగక నిరాశతో ఇంటికి చేరుకుంటారు. అయితే అలాంటి వారి కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. 

Aadhaar New App

తాజాగా కొత్త ఆధార్ యాప్ ‘e-ఆధార్‌’ (e-Aadhaar)ను ప్రారంభించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని UIDAI ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డ్ అప్‌డేట్ ప్రక్రియను సులభతరం చేసే దిశగా ఈ కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త మొబైల్ అప్లికేషన్.. ప్రజలకు వారి ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేయడంలో సులభమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రజలు తమ ఇంటి నుంచి అది కూడా నేరుగా తమ స్మార్ట్‌ఫోన్‌ల నుండి ఆధార్ కార్డ్‌కు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. అలాగే పేరు, పుట్టిన తేదీ వివరాలు, అడ్రస్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. దీంతో చిన్న చిన్న అప్డేట్ల కోసం కూడా ఆధార్ సెంటర్లను సందర్శించాల్సిన అవసరం లేదు.

ఇ-ఆధార్ యాప్ ప్రయోజనాలు

ప్రస్తుతం ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, పేరు, చిరునామా వంటి మార్పులకు ఆధార్ సెంటర్లను సందర్శించి డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉండేది. అయితే కొత్త ఇ-ఆధార్ యాప్‌తో.. ఆధార్ అప్డేట్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా మారుతుంది. వినియోగదారులు తమ ఇళ్ల నుంచే వారి చిరునామా, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ.. ఇతర సమాచారాన్ని అప్డేట్ చేసుకోవచ్చు.

e-Aadhaar -Appను ఎలా సెటప్ చేయాలి

ముందుగా Google Play Storeలో e-Aadhaar యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

కొత్త ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత.. ‘‘I am ready with my Aadhaar’’ పై క్లిక్ చేయండి.

తర్వాత మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి.. ‘‘Continue’’ పై క్లిక్ చేయండి.

నిబంధనలు, షరతులను చూసిన తర్వాత.. క్రింద ‘‘I agree’’ అని టిక్ చేసి, ‘‘Continue’’పై క్లిక్ చేయండి.

తర్వాత మీ ఆధార్ -లింక్ చేయబడిన మొబైల్ నంబర్ లేదా ఏదైనా ఇతర మొబైల్ నంబర్‌ను ఉపయోగించి కొనసాగవచ్చు.

‘‘Proceed to send SMS” క్లిక్ చేయండి.

మీ మొబైల్ స్క్రీన్‌పై ఒక SMS కనిపిస్తుంది. అప్పుడు ‘‘Send SMS’’పై క్లిక్ చేయండి.

SMS పంపిన తర్వాత మీరు మెసేజ్ బాక్స్‌ ఓపెన్ చేయాలి.

మీ మొబైల్ నంబర్ వెరిఫై అవుతుంది.

ఆపై, "Proceed to Face Authentication" క్లిక్ చేయండి.

ఫేస్ అథెంటికేషన్‌ను ప్రారంభించడానికి స్క్రీన్‌పై కొన్ని సూచనలను అనుసరించాలి.

దీని కోసం యాప్‌లో మీ ఫోన్ సెల్ఫీ కెమెరా ఓపెన్ అవుతుంది. 

మీరు మీ కళ్ళు మూసి తెరుస్తూ స్క్రీన్‌పై సెల్ఫీని పూర్తి చేయాలి.

తర్వాత ఆరు అంకెల సెఫ్టీ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి 

అనంతరం యాప్ సెటప్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు