Venu Swamy : సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియా (Social Media) లో ఫుల్ పాపులర్ అయిన వేణు స్వామి (Venu Swamy) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సెలెబ్రెటీలకు సంబంధించి ఇతను చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. ముఖ్యంగా సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని ఆయన చెప్పారు. చెప్పినట్లే జరిగింది. అక్కడితో వేణు స్వామికి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.
అయితే ఈ మధ్య వేణు స్వామి వైఎస్ జగన్ (YS Jagan) గెలుస్తారని చెప్పారు. కానీ అది జరగలేదు. దాంతో ఈయన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక రీసెంట్ గా నాగ చైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో వాళ్ళిద్దరి జాతకం చెప్పి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. ఈ మధ్య వేణు స్వామి స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేసిన అందులో ఓ జర్నలిస్ట్ తనను బెదిరిస్తున్నాడంటూ చెప్పడం వివాదంగా మారింది.
Also Read : తగ్గని మెగాస్టార్ క్రేజ్.. ఇంద్ర రీరిలీజ్ కు ఆర్టీసీ స్పెషల్ బస్సులు!
ఇలాంటి తరుణంలో వేణు స్వామి ఆడియో కాల్ ఒకటి లీకై నెట్టింట వైరల్ అవుతుంది. అందులో ఒకతను వేణు స్వామి అసిస్టెంట్ కు ఫోన్ చేసి వేణు స్వామితో జాతకం చెప్పించుకోవాలి, ఆయన అపాయింట్ మెంట్ కావాలని అడుగుతాడు. దానికి అసిస్టెంట్.. ‘ఒకరికి జాతకం చెప్పాలంటే పది వేలు అవుతుందని’ చెబుతుంది. దాంతో అతను వేణు స్వామిని ఓ రేంజ్ లో తిడతాడు. ఈ ఆడియో క్లిప్ విన్న నెటిజన్స్.. వేణు స్వామి జాతకం చెప్పడానికే పది వేలు తీసుకుంటాడా? అంటూ షాక్ అవుతున్నారు.