Venu Swamy : మరో హీరోయిన్ కాపురంలో వేణుస్వామి చిచ్చు.. విడాకులు తప్పవంటూ జ్యోతిష్యం! సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు తీసుకుంటుందని బాంబ్ పేల్చాడు. రకుల్ పెళ్లయ్యాక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది. పెళ్లి తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని గతంలో చెప్పాను. ఇప్పుడు కచ్చితంగా మరో 6 నెలల్లో ఆమె విడాకులు తీసుకుంటుందని అన్నాడు. By Anil Kumar 21 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Venu Swami Sensational Comments On Actress Rakulpreet Singh : సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాడు. సెలెబ్రెటీలకు సంబంధించి ఇతను చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. గతంలో సమంత - నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని వేణు స్వామి చెప్పాడు. ఆ తర్వాత నిజంగానే వాళ్ళు విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా ఈయన ఓ హీరోయిన్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈసారి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు తీసుకుంటుందని బాంబ్ పేల్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.. రకుల్ ప్రీత్ సింగ్కి పెళ్లి చేసుకున్నాక ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని నేను ఇప్పటికే చెప్పాను. మరోసారి ఈ విషయం గురించి చెబుతున్నాను. ఈమె మరో 6 మంత్స్లో విడాకులు తీసుకుంటుంది. Also Read : రాజ్ తరుణ్ ను లావణ్య ఎంత టార్చర్ పెడుతుందంటే.. RTV తో RJ శేఖర్ భాషా Live.. ఇప్పటికే పెళ్లయ్యాక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది. ఈ క్రమంలో భర్త జాకీ భగ్నాని పూజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అందులో పని చేసే వాళ్ళకి శాలరీ ఇవ్వడం లేదని చెప్పడం, అలాగే ఆ బ్యానర్ పై చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం, రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం వంటివి జరిగాయి. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు కూడా మరో ఆరు నెలల్లో ఉండబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. #actress-rakulpreet-singh #venu-swamy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి