Venu Swamy: వేణు స్వామికి మరోసారి నోటీసులు.. షాకిచ్చిన మహిళా కమీషన్!

జ్యోతిషుడు వేణు స్వామికి తెలంగాణ మహిళా కమీషన్ బిగ్ షాకిచ్చింది. గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడంతో మరోసారి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో తెలిపింది.

New Update
venu swamy

venu swamy

venu swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి తెలంగాణ మహిళా కమీషన్ మరోసారి షాకిచ్చింది. గత నెల ఆగస్టు 25న నోటీసులు ఇవ్వగా.. కోర్టును ఆశ్రయించిన వేణు స్వామి ఆశ్రయించి తప్పించుకున్నారు. ఇక గతంలో ఇచ్చిన ఈస్టేను ఎత్తివేయడంతో మరోసారి  వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్. ఈ నెల 14న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. 

Also Read:  Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. కొట్టుకున్న నబీల్- పృథ్వీ..! కంటెస్టెంట్స్ షాక్

గత నెల ఆగస్టు 22న నోటీసులు 

అయితే ఇటీవలే శోభిత- నాగచైతన్య పెళ్లి విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ మెంబర్స్  వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీని పై స్పందించిన మహిళా కమీషన్ వెనుస్వామికి నోటీసులు జారీ చేసింది. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వేణుస్వామిపైనే కాకుండా ఆయన వీడియోలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని మహిళా కమీషన్ తెలిపింది.

Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్

గతంలోనూ.. 

ఇది ఇలా ఉంటే  సోషల్ మీడియాలో సెలబ్రెటీల జీవితాల గురించి  జాతకాలు  చెబుతూ తరచూ వివాదాల్లో పడుతుంటారు వేణు స్వామి. గతంలోనూ నాగచైతన్య- సమంత పెళ్ళైన కొన్నాళ్ళకు విడిపోతారని సంచలన జ్యోతిష్యం చెప్పాడు. కారణాలు ఏవైనా అయన చెప్పినట్లుగానే సామ్,  చై విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ శోభిత- నాగచైతన్య విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.   

Also Read: 3 స్టేట్స్‌.. 9 థియేటర్స్‌.. రామ్‌చరణ్‌ టీజర్ లాంచ్‌ ప్లాన్‌ చూస్తే మైండ్‌ బ్లాక్ అవ్వడం పక్కా భయ్యా!

Also Read:మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్‌ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్‌ డే స్పెషల్!

Advertisment
తాజా కథనాలు