Actor Joju George Met With An Accident On Thug Life Sets : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Hassan) ‘విక్రమ్’ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో ‘థగ్ లైఫ్’ (Thug Life) కూడా ఒకటి. తమిళ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కమల్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తో పాటు మద్రాస్ టాకీస్ అండ్ రెడ్ జెయింట్ మూవీస్ తో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. షూటింగ్ లో భాగంగా స్టార్ హీరో గాయపడ్డట్లు సమాచారం.
జోజు జార్జ్ కి గాయాలు…
థగ్ లైఫ్ మూవీకి సంబంధించి ప్రస్తుతం పాండిచ్చేరి ఎయిర్‌పోర్టులో వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా హెలికాప్టర్ జంపింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా.. జోజు జార్జ్ ఎడమకాలికి గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు.
ఇందులో భాగంగా డాక్టర్లు జోజు జార్జ్ కాలికి పట్టీ వేశారు. స్టిక్ సాయంతో నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో జోజు జార్జ్ తో పాటూ కోలీవుడ్ స్టార్ హీరో శింబు,గౌతమ్ కార్తీక్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐశ్వర్యలక్ష్మి, త్రిష హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Actor Joju George met with an accident on the sets of Mani Ratnam’s #ThugLife and fractured a bone in his foot. He got injured while performing an action sequence.
Wishing him a speedy recovery pic.twitter.com/jpktW6jAHq
— Haricharan Pudipeddi (@pudiharicharan) June 13, 2024